Brahmastra Movie | ‘నేషనల్ ఫిలిం డే’న బ్రహ్మస్త్ర మూవీ అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Brahmastra Movie Collections On National Film Day | 'సంజు' తర్వాత దాదాపు నాలుగేళ్ళకు 'షంషేరా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రణ్‌బీర్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదలై భారీ ఫ్లాప్‌గా మిగిలింది.
Brahmastra Movie Collections On National Film Day | ‘సంజు’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు ‘షంషేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రణ్‌బీర్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదలై భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ఈ సినిమా ఫలితం రణ్‌బీర్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఆ నిరాశ ఎక్కువ రోజులు లేదు. ‘షంషేరా’ విడుదలైన రెండు నెలల్లోనే ‘బ్రహ్మస్త్ర’ రిలీజైంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. విడుదలైన ప్రతి ఏరియాలో భారీ కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా విడుదలై 15రోజులవుతున్న ఇప్పటికీ భారీ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి.
ఇక ‘నేషనల్ ఫిలిం డే’ సందర్భంగా సెప్టెంబర్ 23న టిక్కెట్ రేట్లు తగ్గిన విషయం తెలిసిందే. సౌత్ స్టేట్స్ మినహాయించి నార్త్‌లో మల్టీప్లెక్స్ థియేటిర్లలో రూ.75లకే టిక్కెట్లను అమ్మారు. కాగా ఆ ఒక్క రోజే బ్రహ్మస్త్ర చిత్రం రూ.15 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ముందు రోజుకంటే దాదాపు 5రేట్లు ఎక్కువగా శుక్రవారం కలెక్షన్లు వచ్చాయి. కాగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ చిత్రం 6లక్షల పైగా టిక్కట్లు అమ్ముడయిన విషయం తెలసిందే. బాలీవుడ్లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడయిన సినిమాగా బ్రహ్మస్త్ర నిలిచింది. దీన్ని బట్టి చూస్తే కంటెంట్ ఉండి.. టిక్కెట్ రేట్లు సాధారణంగా ఉంటే ప్రేక్షకులు సినిమాలను ఏ విధంగా ఆదరిస్తారో తెలుస్తుంది. ఈ చిత్రం 15వ రోజున దాదాపు 15కోట్ల వరకు నెట్ కలెక్షన్లను సాధించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేశాడు. ఈ చిత్రం తెలుగులో 10కోట్లకు పైగా షేర్‌ను సాధించింది. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

