Ram Setu Movie | ఆసక్తి రేకిత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్ సేతు’ గ్లింప్స్..!
Ram Setu Glimps | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి నాలుగైదు సినిమాలను చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి.
Ram Setu Glimps | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి నాలుగైదు సినిమాలను చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మూడు థియేటర్ రిలీజ్ కాగా ఒకటి ఓటీటీలో విడుదలైంది. అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో అక్షయ్‌కుమార్ ఆశలన్ని ప్రస్తుతం రామ్‌సేతు సినిమాపైనే ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
రామ్‌సేతును కాపాడటానికి మన దగ్గర మూడురోజులే ఉన్నాయి అని అక్షయ్‌కుమార్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీజర్ మొత్తం యాక్షన్ సీన్ల్తో ఆసక్తి కరంగా సాగింది. చేసింగ్ సీన్లు, ఫైరింగ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌తోనే చిత్రబృందం సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించాడు. అక్షయ్‌కుమార్‌కు జోడీగా జాక్వైలీన్ ఫెర్నాండేజ్, నుష్రత్ భారుచ్చా హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Experience the Incredible world of Ram Setu. #ramsetu in theatres. #October25th@akshaykumar @Asli_Jacqueline @Nushrratt #AbhishekSharma @vikramix @primevideoin #CapeOfGoodFilms @LycaProductions @Abundantia_Ent #DrChandraprakashDwivedi @ShikhaaSharma03 @Vbfilmwala pic.twitter.com/A2OGtpmub7
— Satya Dev (@ActorSatyaDev) September 26, 2022
Read Also:
Jawan Movie | భారీ ధరకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా
Allu Sirish | అల్లు శిరీష్ కొత్త సినిమా టీజర్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో?
777 Charlie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘777చార్లీ’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

