777 Charlie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘777చార్లీ’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
777 Charlie Movie On Ott | కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'శ్రీమన్నారాయణ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం తెలుగులో అంతగా కలెక్షన్లు సాధించకపోయినా.. నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
777 Charlie Movie On Ott | కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘శ్రీమన్నారాయణ’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం తెలుగులో అంతగా కలెక్షన్లు సాధించకపోయినా.. నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక ఇటీవలే వచ్చిన ‘777చార్లీ’తో ఇక్కడ వారికి మరింత దగ్గరయ్యాడు. ఎలాంటి అంచనాల్లేకుండా జూన్ 10న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో ఈ చిత్రానికి గుర్తింపు వచ్చింది. సుమారు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనల్ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ మూవీ డిజిటల్ రిలీజ్ గురించి ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
‘777 చార్లీ’ సినిమాను సెప్టెంబర్ ౩౦నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే ఈ చిత్రాన్ని ‘పే పర్ వ్యూ’ పద్దతిలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఈ చిత్రాన్ని చూడాలంటే రెంట్ పే చేయాల్సి ఉంటుంది. కాగా ఈ సినిమా కన్నడ వెర్షన్ ఇప్పటికే ‘వూట్’లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాబీ సింహా, సంగీత శృంగేరీ కీలకపాత్రల్లో నటించారు. అడ్వేంచర్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరంవహ్ స్టూడీయోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్‌బాబు విడుదల చేశాడు. తెలుగులో ఈ చిత్రానికి రూ.4 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.
Read Also:
Jawan Movie | భారీ ధరకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా
Brahmastra Movie | ‘నేషనల్ ఫిలిం డే’న బ్రహ్మస్త్ర మూవీ అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Dhamaka Movie | ‘ధమాకా’లో రవితేజ డ్యూయల్ రోల్లో నటించనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

