Katrina Kaif | బాలీవుడ్ స్టార్ కపుల్స్ కత్రినాకైఫ్ (Katrina Kaif)-విక్కీ కౌషల్ (Vicky Kaushal) గుడ్‌న్యూస్ చెప్పారు. పెండ్లైన నాలుగేండ్లకు తల్లిదండ్రులయ్యారు. కత్రినా పండంటి మగ బిడ్డకు (Baby Boy) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ స్టార్ జంట సోషల్ మీడియా ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్.. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కత్రినా తల్లి కానున్నట్లు ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 23న తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను కత్రినా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం’ అంటూ ప్రకటించింది. ఇప్పుడు పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు.. కత్రినా-విక్కీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read..
Peddi First Single | రామ్‌చరణ్ పెద్ది’ ఫస్ట్ సింగిల్.. ‘చికిరి చికిరి’ వచ్చేసింది.
Virat -Anushka | విరాట్–అనుష్క బ్రేకప్.. ఆ స్టార్ ఎంట్రీతో చివరకు ఏమైందంటే..!
Gouri Kishan | నా బరువు గురించి మీకెందుకు?.. రిపోర్టర్‌కు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన నటి గౌరి కిషన్