Actress Gouri Kishan | ‘96’ ఫేమ్ హీరోయిన్ మలయాళ నటి గౌరీ కిషన్ (Gouri Kishan) తన రాబోయే చిత్రం ‘అదర్స్’ (Others) ప్రెస్ ఈవెంట్లో ఓ రిపోర్టర్ అడిగిన అభ్యంతరకరమైన ప్రశ్నపై తీవ్రంగా స్పందించింది.
అసలు ఏం జరిగిందంటే.. ఈ మూవీలో ఓ పాట సన్నివేశంలో హీరో ఆదిత్య మాధవన్ గౌరీని ఎత్తుకుని తిప్పుతాడు. అయితే చిత్రబృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని సాకుగా తీసుకుని రిపోర్టర్ హీరోని అడుగుతూ.. హీరోయిన్ను ఎత్తుకుని తిరిగేటప్పుడు ఆమె బరువు ఎంత ఉంది? భారీగా అనిపించిందా? అని అడుగుతాడు. దీనికి హీరో సమాధానమిస్తూ.. నేను జిమ్ చేస్తాను కాబట్టి భారీగా అనిపించలేదు అని చెబుతాడు. అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మరో ప్రెస్ మీట్ జరుగుతుంది.. ఆ ఈవెంట్లో కూడా సదరు రిపోర్టర్ గౌరీ బరువు గురించి మళ్లీ అడుగుతాడు. దీంతో చిర్రెత్తుకోచ్చిన గౌరీ ఆ రిపోర్ట్ర్పై విరుచుకుపడింది.
నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేయబోతున్నావు? ఇది బాడీ షేమింగ్! ఒక స్త్రీని ఆబ్జెక్టిఫై చేస్తున్నావు. నా పాత్ర గురించి, నా నటన గురించి ఒక్క ప్రశ్న కూడా లేదు. అందరూ నా బరువే అడుగుతున్నారు. మగ నటుల్ని ఇలా అడిగే ధైర్యం మీకు ఉందా? ఇది జర్నలిజం కాదు… మీ వృత్తికే అవమానం అంటూ ప్రశ్నలతో కడిగిపారేసింది. అయితే కొంతమంది రిపోర్టర్లు ఆ ప్రశ్నను కేవలం సరదాగా అడిగినట్లు కొట్టిపారేయడానికి ప్రయత్నించారు. కానీ గౌరీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించింది. నాకు అది సరదాగా అనిపించలేదు. బాడీ-షేమింగ్‌ను నార్మలైజ్ చేయడం ఆపండి. ఆ ప్రశ్న నా గురించి కాబట్టి నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకు ఉంది అని ఆమె తేల్చి జెప్పింది.
దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో గౌరీ కిషన్ ధైర్యంపై అనేక ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేస్తూ.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై గౌరీ అద్భుతంగా బదులిచ్చింది. అవమానకరమైన, అనవసరమైన ప్రశ్నను ఖండించినప్పుడు అరుపులు ఎదురుదెబ్బలు తప్పవు. ఇంత చిన్న వయసులో కూడా ఆమె ధైర్యంగా నిలబడటం గర్వకారణం. ఏ పురుష నటుడిని కూడా అతని బరువు గురించి అడగరు అని పేర్కొంది.
అయితే ఈ ప్రెస్ మీట్లో తన సహనటుడు ఆదిత్య మాధవన్, దర్శకుడు మౌనంగా ఉండటంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదిత్య మాధవన్ స్పందిస్తూ.. నేను మౌనంగా ఉన్నానంటే నేను బాడీ-షేమింగ్‌ను ఆమోదించినట్లు కాదు. ఆ ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది అది నా మొదటి చిత్రం. నేను వెంటనే కలుగజేసుకుంటే బాగుండేది. ఈ విషయంపై నేను మరోసారి క్షమాపణలు చెబుతున్నాను అని ఆదిత్య ఒక ప్రకటన విడుదల చేశారు.
#Watch | உடல் எடையை பற்றி விமர்சித்து கேள்வி எழுப்பிய யூடியூபர்..
– கொந்தளித்த நடிகை கெளரி கிஷன்#SunNews | #ActressGowriKishan | #MoviePressMeet pic.twitter.com/HzI7B8UkZZ
— Sun News (@sunnewstamil) November 6, 2025