Virat -Anushka |బాలీవుడ్, క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా విరాట్ కోహ్లి – అనుష్క శర్మకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో లండన్‌లో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే వీరి బంధం మధ్యలో కాస్త డిస్ట్రబ్ అయిందని, ఒక దశలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని తాజాగా ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 2017 డిసెంబర్ 11న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విరుష్క జంట పెళ్లి తర్వాత అందరికీ ‘డ్రీమ్ కపుల్’గా మారింది. కానీ, 2016లో వీరి మధ్య పెద్ద విభేదాలు తలెత్తి, బ్రేకప్ వరకు వెళ్లింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో అనేక రూమర్లు హల్చల్ చేశాయి.అనుష్క యాక్టింగ్ కొనసాగించడం విరాట్‌కు నచ్చలేదని, ఆమెను సినిమాలు మానేయమన్నాడని, దీనిపై విరాట్-అనుష్క మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే ఆ రూమర్లలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, కొంతకాలం ఈ ఇద్దరూ దూరంగా ఉన్న విషయం మాత్రం నిజమే. అప్పట్లో అనుష్క సోదరుడు కర్నేష్ శర్మ ఇద్దరినీ మళ్లీ కలిపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. ‘సుల్తాన్’ సినిమాలో అనుష్కతో కలిసి నటించిన సల్మాన్ ఖాన్ ఈ జంట మళ్లీ ఒకటవ్వడానికి కీలక పాత్ర పోషించాడట. బాలీవుడ్ వర్గాల ప్రకారం, సల్మాన్ ఇద్దరితోనూ మాట్లాడి, అపోహలు తొలగించి, వాళ్ల మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేశాడని చెబుతున్నారు. ఆయన సలహాలతోనే విరాట్-అనుష్క మళ్లీ దగ్గరయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా ఒకప్పుడు బ్రేకప్ దశకు చేరుకున్న ఈ ప్రేమకథ, సల్మాన్ ఖాన్ జోక్యంతో మళ్లీ కలిసిపోయింది. ప్రస్తుతం ఈ జంట బాలీవుడ్–క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రేరణాత్మక జంటగా నిలిచారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాత ప్రేమకథ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు “సల్మాన్ ఖాన్ లేకపోతే విరుష్క లవ్ స్టోరీ ఇలా ఉండేదా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్లకి గుడ్ బై చెప్పి ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.