katrina kaif marriage date | ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో విక్కీకౌశల్, కత్రినాకైఫ్ జంట వివాహం గురించిన చర్చ జోరుగా సాగుతున్నది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరికి ఇటీవలే ఉత్తర భారత సంప్రదాయ పద్దతిలో ‘రోఖా’వేడుక (ఇరు కుటుంబాలు పెళ్లికి సమ్మతిని తెలియజేస్తూ జరుపుకొనే కార్యక్రమం) నిర్వహించారని తెలిసింది. నిశ్చితార్థంతో పాటు వివాహానికి సంబంధించిన తేదీని కూడా నిర్ణయించారని ప్రచారం జరుగుతున్నది.
బాలీవుడ్ దర్శకుడు కబీర్‌ఖాన్ గృహంలో దీపావళి రోజున రోఖా వేడుకను నిర్వహించారని చెబుతున్నారు. వచ్చే నెల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లుగా తెలిసింది. విక్కీకౌశల్ ఇటీవలే ముంబయిలోని జుహూ ప్రాంతంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారని, వివాహనంతరం ఈ జంట ఆ గృహంలోకి అడుగుపెడతారని వారి సన్నిహితులు అంటున్నారు. పెళ్లి వేడుకను కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించిన ‘సర్దార్ ఉద్ధమ్’ చిత్రం ఇటీవలే విడుదలైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vicky and Katrina honeymoon | వెడ్డింగ్ తర్వాత నో హనీమూన్ అట..!
Katrina Kaif: కత్రినా- విక్కీ రోకా వేడుక పూర్తైందా.. పెళ్లి ఎప్పుడు?
Katrina Kaif: కత్రినా- విక్కీ వివాహం పక్కా.. వెడ్డింగ్ కార్డ్స్ అందుకే ఇవ్వడం లేదట..!
Katrina: 15 ఏళ్ల నుంచి నా పెళ్లి గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది: కత్రినా