గత కొద్ది రోజులుగా బీటౌన్‌లో విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ పెళ్లికి సంబంధించి జోరుగా ప్రచారం నడుస్తుంది. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట రీసెంట్గా కలిసికట్టుగా కనిపించారు. వారిద్దరు పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విక్కీ-కత్రినా రోకా వేడుక జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి ముహూర్తం, వేదిక, విందు వంటి విషయాలు మాట్లాడుకోవడానికి నార్త్‌లో రోకా వేడుక నిర్వహిస్తుంటారు.
డిసెంబర్ 7వ తేదీన విక్కీ-కౌశల్ ఒక్కటయ్యేందుకు సిద్దమయ్యారని సమాచారం. రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. కాకపోతే తమ పెళ్లి గురించి ఎక్కడా బయటకు పొక్కకుండా ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మూడు రోజుల వేడుకగా ఈ వివాహం జరగనుందని సమాచారం. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే మొదలు కాగా, ఈ విషయం బయటకు రాకుండా చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారట. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఎవరికీ పంపకపోగా అత్యంత సన్నిహితులకు మాత్రమే ఈ ఆహ్వానాలు అందనున్నాయని చెప్తున్నారు.