పొడుగు కాళ్ల సుందరి కత్రనా కైఫ్(Katrina Kaif) మల్లీశ్వరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించి అలరించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ ఊపు ఊపింది. ఈ మధ్య అమ్మడి హవా కాస్త తగ్గడంతో ఫొటో షూట్స్ చేస్తూ కేక పెట్టిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, ఆమె ప్రియుడు విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని వార్తలు వస్తున్నాయి.
రీసెంట్గా రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సస్ ఫోర్ట్ బర్వారాలో కత్రినా, విక్కీ కౌశల్(Vicky Kaushal) తమ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. డిసెంబర్ లో పెళ్లి జరగనుందని ప్రచారం చేస్తున్నారు.ఈ క్రమంలో కత్రినా స్పందిస్తూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.. ఈ 15 ఏళ్ల నుంచి నా పెళ్లి గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది. ఒక్కో వ్యక్తితో ఒక్కో నెల.. నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు” అని మండిపడింది.
విక్కీ, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏమి లేవని కత్రినా చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు కామెంట్స్‌కి అందరు షాక్ అవుతున్నారు.