బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’ కబీర్‌ఖాన్ దర్శకుడు. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించాల్సిన చిత్రమిదని, ఆయన అర్థాంతర మరణంతో సినిమా ఆగిపోయిందని తెలిసింది. ఇప్పుడు అదే కథతో ‘చందూ ఛాంపియన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అంటు న్నారు.
మహారాష్ట్రకు చెందిన మాజీ సైనికుడు మురళీకాంత్ పేట్నర్ జీవిత కథ ఇదని తెలుస్తున్నది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఆయన అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని తెలిసింది. సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.