‘ఆషికీ’ సిరీస్ బాలీవుడ్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో ‘ఆషికీ-3’ రాబోతున్నది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. అనురాగ్‌బసు దర్శకత్వం వహిస్తారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్‌కుమార్ నిర్మించబోతున్నారు. జనవరిలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురానున్నారు. దర్శకుడు అనురాగ్‌బసు మాట్లాడుతూ ‘రెండు భాగాల తరహాలోనే మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కించబోతున్నాం.
ఈ కథలోని భావోద్వేగాలు హృదయాలకు హత్తుకుంటాయి. ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ కథ, కథనాలు సాగుతాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుదిదశకు చేరుకుంది’ అని చెప్పారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.