Chandu Champion | బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం ‘చందూ ఛాంపియన్’ (Chandu Champion). ఈ సినిమాపై ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్ ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా చూసిన మను కార్తీక్ ఆర్యన్ నటనపై స్పెషల్ పోస్ట్ పెట్టింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించి సత్తా చాటిన మను బాకర్ తాజాగా స్వదేశానికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఇక భారత్ రావడంతో ఆమెకి ఘన స్వాగతం లభించింది. అయితే భారత ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ సిని ప్రముఖులను కలిసిన మను తాజాగా ఇంట్లో కుర్చోని బాలీవుడ్ సినిమాను చూసింది.
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’ (Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పారాలింపిక్ బంగారు పతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మను బాకర్ మువీపై ప్రశంసలు కురిపించింది.
ఒలింపిక్స్ ముగిశాయి. అయితే ఇంటికి వచ్చిన వెంటనే చందు ఛాంపియన్ సినిమాను చూశాను. ఈ సినిమా నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంది. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఈ సినిమలో నటించినందుకు అతడికి ఒలింపిక్ మెడల్ ఇవ్వాలని తెలిపింది. అయితే దీనికి కార్తీక్ ఆర్యన్ తాజాగా రిప్లయ్ ఇచ్చాడు. మీలాంటి రియల్ ఛాంపియన్ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్‌లో రాణించారని రాసుకోచ్చాడు.
Also read..