Devara Movie | అగ్ర హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఎప్పుడు అప్డేట్ ఇస్తారా అని తారక్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
దేవర సినిమాకు సంబంధించి పార్ట్ 1 షూటింగ్‌ను ముగించాను. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. మీ అసాధారణమైన ప్రేమను మిస్ అవుతాను. కొరటాల శివ రూపొందించిన దేవర ప్రపంచంలోకి సెప్టెంబర్ 27న కలుద్దాం అంటూ రాసుకోచ్చాడు.
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.
Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September. pic.twitter.com/RzOZt3VCEB
— Jr NTR (@tarak9999) August 13, 2024
Also Read..