Kartik Aaryan | బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కార్తీక్ ఆర్యన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం Tu Meri Main Tera Main Tera Tu Meri సినిమాలో నటిస్తున్నాడు. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా ప్రాజెక్టును కూడా పూర్తి చేశాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. కాగా కార్తీక్ ఆర్యన్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
పవన్ కల్యాణ్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడట కార్తీక్ ఆర్యన్. ఇంతకీ ఎవరా దర్శకుడనే కదా మీ డౌటు. పవన్ కల్యాణ్‌తో పంజా సినిమా తెరకెక్కించిన తమిళ దర్శకుడు విష్ణువర్ధన్. కోలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న విష్ణువర్ధన్ హిందీలో షేర్షా తెరకెక్కించాడని తెలిసిందే.
బీటౌన్ సర్కిల్ కథనాల ప్రకారం కార్తీక్ ఆర్యన్ జాంబి జోనర్లో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఇదే క్రమంలో విష్ణువర్ధన్ యూనిక్ జాంబీ స్క్రిప్ట్‌ను అతడికి వినిపించాడట. ఈ స్క్రిప్టుకు కార్తీక్ ఆర్యన్ ఇంప్రెస్ అవడమే కాదు.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.
అన్నీ అనుకున్నట్టు కుదిరితే 2026లో సెట్స్‌పైకి వెళ్లనుందని ఫిలింసర్కిల్ ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై విష్ణువర్ధన్, కార్తీక్ ఆర్యన్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Simran | బాలీవుడ్‌కు నా గురించి తెలియదు.. హాట్ టాపిక్‌గా సిమ్రాన్ కామెంట్స్
Raja Saab | రాజాసాబ్ బ్యాక్ టు షూట్.. ప్రభాస్ టీం ఇప్పుడెక్కడుందంటే..?