Sathyam Sundaram | కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Aravindha Swamy) లీడ్ రోల్స్‌లో నటించిన కోలీవుడ్ ప్రాజెక్ట్ మెయ్యళగన్ (Meiyazhagan). 96 ఫేం ప్రేమ్ కుమార్ సీ (Prem Kumar C) దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదలైంది. తమిళంలో 2024 సెప్టెంబర్ 27న విడుదల కాగా.. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలైంది.
విడుదలైన చాలా కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లు, ఓటీటీలో సినిమా చూడలేకపోయిన వారి కోసం ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఇక టీవీలో సందడి చేసేందుకు రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం సత్యం సుందరం స్టార్ మాలో ఫిబ్రవరి 9న (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కానుంది. ఇక సినిమా ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కార్తీ, అరవింద్‌స్వామి మధ్య అనుబంధం నేపథ్యంలో భావోద్వేగపూరిత, సరదా సన్నివేశాలతో సాగే సినిమా మరి టీవీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీని హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్పై సూర్య- జ్యోతిక రాజశేఖర్ కర్పూరసుందరపాడ్యన్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో రాజ్ కిరణ్, శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిణి, జయప్రకాశ్, శ్రీరంజిని ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి 96 ఫేం గోవింద్ వసంత సంగీతం అందించాడు.
సత్యం సుందరం ట్రైలర్..
World television premiere Movie:#aravindswamy #Karthi #Devadarshini #swathi Staring #SathyamSundaram Next sunday 6pm on #StarMaa #Meiyazhagan #premkumar #2DEntertainments #Jyothika #suriya #SathyamSundaramOnStarMaa pic.twitter.com/Tmn10boNOB
— TSRU UPDATES (@TsruUpdates) February 2, 2025
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే