Karthi 29 | తమిళ స్టార్ నటుడు కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఇప్పటికే సత్యం సుందరం, సర్దార్, వా వాతియర్ సినిమాలతో బిజీగా ఉన్న కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. తానక్కరన్ సినిమా ఫేం దర్శకుడు తమిళ్(Tamizh) ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై SR ప్రకాష్‌బాబు, SR ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ బ్యానర్లో ఇప్పటికే కార్తీ ధీరన్ అధిగారమ్ ఒండ్రు(ఖాకీ) సినిమాతో పాటు సుల్తాన్, కాష్మోరా, జపాన్ సినిమాలను చేశాడు. మళ్లీ ఈ బ్యానర్లో కార్తీ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
కార్తీ29 అంటూ ఈ ప్రాజెక్ట్ రానుండగా.. ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు. ఈ పోస్టర్లో ఒక భారీ ఓడ సముద్రంలో వెళుతున్నట్లుగా ఉంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది.
A new chapter begins with #Karthi29! We’re excited to bring this special film to life, starring the incredible @Karthi_Offl! More surprises await! ✨#Karthi @directortamil77 @prabhu_sr @B4UMotionPics @ivyofficial2023 #IshanSaksena @RajaS_official @SunilOfficial pic.twitter.com/yBeluLxIzo
— DreamWarriorPictures (@DreamWarriorpic) September 15, 2024
Also read..