అమరావతి : ఏపీలోని విశాఖ సముద్రంలో ప్రమాదవశాత్తు బోటు (Boat Fire) దగ్ధమయ్యింది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు మత్స్యకారులు(Fishermens ) సురక్షితంగా బయట పడ్డారు. ఆదివారం 5గురు మత్స్యకారులు ఫిషింగ్ బోటు(Fishing Boat) లో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బోటు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు సముద్రంలో దూకారు. సమీపంలో ఉన్న మరో బోటులో ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.
బోటు దగ్ధం కావడంతో రూ. 40 లక్షల నష్టం జరిగిందని మత్స్యకారులు తెలిపారు. కాగా మత్స్యకారుల పరిస్థితి గురించి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. బాధిత మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని అధికారులు మంత్రికి వివరించారు.