Molestation : కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి తోడుగా కోల్‌కతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ICH) చిల్డ్రన్స్ వార్డులో నిద్రిస్తున్న మహిళపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని హాస్పిటల్లో వార్డ్ బాయ్‌గా పనిచేస్తున్న తనయ్ పాల్ (26)గా గుర్తించారు.
చిల్డ్రన్స్ వార్డ్‌లోకి ప్రవేశించిన తనయ్ పాల్ మహిళను అభ్యంతరకరంగా తాకాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
ఆపై నిందితుడిని స్ధానిక కోర్టులో హాజరు పరచగా నిందితుడిని కోర్టు పోలీస్ కస్టడీకి ఆదేశించింది. ఇక పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న నర్స్‌ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేయగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రోగికి నర్సు సెలైన్ ఎక్కిస్తుండగా రోగి ఆమెను అభ్యంతరకరంగా తాకాడు. తన పట్ల అసభ్యంగా వ్యవహరించడంతో పాటు తనపట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read More :
Vande Bharat trains | కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ