‘అందం కోసం ట్రీట్మెంట్లు తీసుకునే బదులు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ జీవినశైలిలో మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లడమే ఉత్తమం.’ అంటున్నారు నాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ కరీనా కపూర్. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కెరీర్, ఆరోగ్యం తదితర అంశాలపై మాట్లాడారు. ‘నా దృష్టిలో వయసు అనేది ఓ నంబర్ మాత్రమే.
మనసులు ఆరోగ్యంగా ఉంటే, మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వృద్ధాప్యం వల్ల ఎదురయ్యే ఏ సమస్యనైనా అప్పుడు అధిగమించొచ్చు. 75ఏండ్ల వయసులోనూ నేను సెట్స్‌కి వెళ్లగలగాలి. నా మనవరాళ్లను ఎత్తుకోడానికి వంగగలగాలి. బతికున్నంతకాలం పనిచేయాలి. పనిచేస్తూనే వెళ్లిపోవాలి. అదే నేను కోరుకునేది. దానికోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తా.’ అంటూ చెప్పుకొచ్చారు కరీనా.