Kareena Kapoor | బాలీవుడ్ బెబో కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. ఇప్పుడు తన ఇద్దరు పిల్లలు, భర్తతో సంతోషంగా ఉంటుంది కరీనా కపూర్. తాజాగా ఈ భామ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తన తిండి, ఇతర అలవాట్ల గురించి మాట్లాడింది. మొదటి కానుపు తర్వాత 45 కేజీల బరువు పెరిగిన నేను రెండో కానుపు తర్వాత 25 కేజీలు బరువు పెరిగినట్టు తెలియజేసింది. అయితే రెండు సార్లు కూడా జిమ్, యోగా సెషన్స్, మెడిటేషన్స్ తో పాత రూపాన్ని తెచ్చుకున్నానని పేర్కొంది. నేను తినడం ఎక్కువగా ఆస్వాదిస్తాను. చిప్స్ ప్యాకెట్లు ఇష్టంగా తింటాను. అయితే జెబ్ పుట్టాక 45 కేజీల బరువు పెరగడంతో అది తగ్గించుకునేందుకు ఒత్తిడిని ఎదుర్కొన్నాను.
సన్నగా కనిపించడానికి నేను ఎప్పుడూ ఆకలితో అలమటించలేదు. టీనేజ్లో కూడా ఎప్పుడు చిప్స్ ప్యాకెట్స్ తింటూ ఉండేదానిని. అయితే జెహ్ పుట్టాక తిరిగి వెళ్లి జిమ్లో శ్రమించాలని అనుకున్నాను. ఆ తర్వాత జహంగీర్ అలీ ఖాన్ జన్మించాడు. 25 కేజీలు అదనపు బరువు పెరిగాను.. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యాను అని కరీనా కపూర్ స్పష్టం చేసింది. తనకు కిచిడీ అంటే కూడా ఎంతో ఇష్టమని, రెండు మూడు రోజులు కిచిడీ తినకపోతే వెంటనే తనకు క్రేవింగ్స్ విచ్చేస్తాయని పేర్కొంది. కిచిడీ తినకుండా తన బాడీ ఉండలేదని, అది తినకపోతే నాకు నిద్ర కూడా పట్టదని కరీనా కపూర్ స్పష్టం చేసింది.
బియ్యం, పప్పులు, తేలికైన మసాలాలతో చేసే కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. అందులో అన్ని పోషక విలువలుంటాయని, తిన్న వెంటనే ఈజీగా డైజెస్ట్ అవుతుందని కూడా కరీనా తెలిపింది. ఇక తన హెల్త్ గురించి మాట్లాడుతూ తాను సరైన డైట్ మెయిన్టెయిన్ చేయడం వల్లే ఇప్పటికీ తనకు ఇంత ఫిట్నెస్ ఉందని కరీనా వెల్లడించింది. 2024లో కరీనా కపూర్ ఖాన్ క్రూ, సింఘం ఎగైన్ చిత్రాలలో కనిపించింది. తదుపరి సినిమా గురించి ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.