తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సాయిపల్లవి (Sai Pallavi). డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. సాయిపల్లవిని కొందరు అందం, అభినయంలో సౌందర్యతో పోలిస్తే..ఫ్యాన్ ఫాలోయింగ్‌లో లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. సాయిపల్లవికి ఫిదా అయిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారంటే ఈ భామకున్న క్రేజీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం రానా, సాయిపల్లవి కాంబోలో వస్తున్న విరాటపర్వం ట్రైలర్(Virata Parvam trailer)ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ ట్రైలర్‌పై బాలీవుడ్ (Bollywood) దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar)సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది రానా! సినిమా చేసేందుకు వేచి ఉండలేకపోతున్నా. ఆసక్తిగా ఎదురుచూస్తున్నాఉ. మీరంతా అద్భుతంగా కనిపిస్తున్నారు. నేను సాయిపల్లవికి పెద్ద అభిమానిని అంటూ ట్వీట్ చేశాడు కరణ్ జోహార్. బాలీవుడ్‌కు ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లను పరిచయం చేసిన కరణ్ జోహార్ ఏకంగా సాయిపల్లవిని ఆకాశానికెత్తేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
మరి కరణ్ జోహార్ ప్రశంసలపై సాయిపల్లవి ఎలా రియాక్ట్ అవుతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఆమె ఫాలోవర్లు, అభిమానులు. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్న విరాటపర్వం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
This looks fantastic Rana!!!! Can’t wait to see it! Intense Raw and Rivetting!!! You are superb! And I am a huge @Sai_Pallavi92 fan! ❤️ https://t.co/FpvsbHQhQ2
— Karan Johar (@karanjohar) June 6, 2022
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ ఈ సారి కొత్త ప్లాన్‌తో వస్తున్నాడా..?
Read Also : Sharwanand | శర్వానంద్‌కు జోడీగా రాశీఖన్నా..షూటింగ్ షురూ ఎప్పుడంటే..!