Kannappa Trailer | మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చారిత్రక చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్రతారలు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రాబోతున్న చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం(జూన్ 13) రోజున విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
13th June!#kannappa #harharmahadevॐ pic.twitter.com/BHcUzqIZZu
— Vishnu Manchu (@iVishnuManchu) June 10, 2025
Read More