Kannappa | కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా హాలీవుడ్ లెవల్లో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇదిలావుంటే ఈ మూవీ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడు (Nathanadhudu) అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించిన కన్నప్ప టీం ఆ తర్వాత సినీయర్ నటి మధుబాల ‘పన్నగ’ (Pannaga) అనే చెంచుల దొరసాని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో పాత్రను కన్నప్ప టీం విడుదల చేసింది. ఈ సినిమాలో తెలుగు సినీయర్ నటుడు దేవరాజ్ ‘ముండడు’ (Mundadu) అనే ఎరుకల దొర(Erukala Dora) పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది.
”నీలిపాల కొండ ప్రాంతంలో పుట్టారు. నందివింటి వాగు నీరు తాగి పెరిగారు. నాయకుడు ముండడు, అతని కుమారుడు బెబ్బులి… అన్ని తెగలకు తానే నాయకుడు కావాలని ఆశ పడుతుంటాడు. అంటూ దేవరాజ్ పోస్టర్ని విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే దేవరాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
Introducing #Devaraj from the world of #Kannappa🏹 hailing from the Nilipala Hills, Mundadu and @iamlavipajni as his son #Bebbuli is ready to unleash a new wave of strength and fierce spirit #HarHarMahadevॐ pic.twitter.com/gHloxtsUdF
— Vamsi Kaka (@vamsikaka) August 5, 2024
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ కన్నప్పలో శివుడిగా కనిపించబోతున్నాడు. గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శివరాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
Also Read..
Sanaya Irani | మ్యూజిక్ అడిషన్ అని వెళితే బికినీ వేసుకోవాలి అన్నాడు : బాలీవుడ్ నటి
Graham Thorpe | ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం.. మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత
Heart attack | డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన టీచర్.. విషాదం మిగిల్చిన వినోదం..!