Kannappa Making Video | మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. విడుదలకు ఇంకా 5 రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇటీవల ట్రైలర్‌తో పాటు ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన చిత్రయూనిట్ తాజాగా మేకింగ్ వీడియోను పంచుకుంది.
దాదాపు మూడు నిమిషాల నిడివితో విడుదలైన ఈ మేకింగ్ వీడియోలో సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపించారు. భారీ సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దడానికి టీమ్ పడ్డ కష్టాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. కన్నప్ప సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని మేకింగ్ వీడియో స్పష్టం చేస్తోంది. అద్భుతమైన విజువల్స్, భారీ స్థాయిలో డిజైన్ చేసిన సెట్లు, గ్రాఫిక్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబులతో పాటు, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పెద్ద తారాగణం ఈ చిత్రంలో ఉంది. మేకింగ్ వీడియోలో వీరి లుక్స్, షూటింగ్ సమయంలో వారు పడ్డ శ్రమను కూడా చూపించారు. ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Read More