Salman Khan | బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. 59 ఏళ్ల సల్మాన్ గతంలో పలు ఎఫైర్స్ నడిపించాడే తప్ప పెళ్లి జోలికి వెళ్లడం లేదు. సినిమాలే తన జీవితం అన్నట్టు ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయనకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో సల్మాన్ కు ప్రభుత్వం భద్రతను కూడా కల్పించింది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో”కు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్మాన్ తన జీవితంలో ఇటివల ఎదురైన అనారోగ్య సమస్యలను గురిచి వెల్లడించి అందరు షాక్ అయ్యేలా చేశౄడు. .
సినిమాల్లో చాలా సార్లు నా ఎముకలు, పక్కటెముకలు విరిగిపోయాయి. ట్రైజెమినల్ న్యూరల్జియా ఉన్నప్పటికీ నేను పని చేస్తున్నాను. నాకు మెదడులో అనూరిజం ఉంది. రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్ కూడా (AV మాల్ ఫార్మేషన్) ఉన్నాయి. అయినప్పటికీ నేను ఇంకా పనిచేస్తున్నాను. వీటివల్ల నేను సంపాదించే దాంట్లో సగం వీటికే పోతుంది. ఇదంతా చిన్నప్పుడు జరిగి ఉంటే అంతా తిరిగి సంపాదించుకునేవాడిని. ఇప్పుడు కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడతాను అని తెలిపారు. ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే ఇది నరాలకు సంబంధించిన వ్యాధి కాగా, దీని వలన ముఖానికి సంబంధించిన నొప్పి, నరాలకి సంబంధించిన పెయిన్ వస్తుంది.
AV మాల్ ఫార్మేషన్ అంటే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి కాగా, దీనివల్ల మెదడు, వెన్నుముకకు రక్తం సరఫరా అయ్యే రక్తనాళాల్లో అడ్డంకులు వస్తాయి.. బ్రెయిన్ అనూరిజం అంటే మెదడులోని రక్తనాళాల్లో బలహీనత ఏర్పడి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. ఇన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సల్మాన్ ఏ రోజు దాని గురించి ఓపెన్ కాలేదు. ఆరోగ్యం విషయంలో మొదటిసారిగా ఇంత బోల్డ్ గా చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతే కాదు తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. 59 ఏళ్ల సల్మాన్ ఖాన్ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.