ముంబై: టీవీ నటి పవిత్రా జయరాం( Pavitra Jayaram) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తెలుగు టీవీ సీరియల్ త్రినయనిలో ఆమె తిలోత్తమ పాత్రను పోషించారు. మెహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అదుపు తప్పిన కారు .. డివైడర్ను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తున్న బస్సు.. ఆమె కారును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నటి పవిత్ర.. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. కర్నాటకలోని మాండ్యా జిల్లా హనకేరీ నుంచి ఆమె తిరిగి వస్తోంది. కారు ప్రమాదంలో నటి పవిత్ర సోదరి అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, నటుడు చంద్రకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. నటి పవిత్ర మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొన్నది.