కన్నడ రేంజ్ పెరుగుతుంది.. పాన్ ఇండియన్ దండయాత్ర..

Jai Bajarangi | ఒకప్పుడు కన్నడ సినిమాలను చాలా తక్కువ అంచనా వేసే వాళ్లు. అక్కడ మార్కెట్ కూడా 30 కోట్లు దాటేది కాదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా 30 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ దర్శకులు కూడా పెద్ద పెద్ద సినిమాలు తెరకెక్కిస్తున్నారు. మరీ ముఖ్యంగా వందల కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చే సత్తా తమ సినిమాలకు ఉంది అని నిరూపిస్తున్నారు. ఇందుకు మూడేళ్ల కింద విడుదలైన కేజీఎఫ్ సినిమానే ఉదాహరణగా చెప్పొచ్చు. కేజీఎఫ్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా 200 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేజీఎఫ్ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోయాయి. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో కన్నడ హీరోలు అన్ని ఇండస్ట్రీలపై కన్నేస్తున్నారు. అందుకే ఇప్పుడు శాండిల్‌వుడ్ నుంచి మరిన్ని పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి.
ఇప్పటికే పొగరు సినిమాతో అన్ని ఇండస్ట్రీల్లోని ప్రేక్షకులను పలకరించాడు ధ్రువ సర్జ. సుదీప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి హీరోలు కూడా తమ సినిమాలను అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు శివరాజ్ కుమార్ నటించిన బజరంగీ 2 సినిమా కూడా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. దీనికితోడు ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన శ్రీమురళి ఇప్పుడు తాను నటిస్తున్న మదగజ సినిమాను కూడా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందిస్తుండటం విశేషం. ఇక కేజీఎఫ్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. 2022 ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండో భాగం ఏకంగా 300 కోట్ల బిజినెస్ చేస్తుంది. కేజీఎఫ్ మొదటి చాప్టర్‌తో యశ్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు భారీస్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఇలా ఒకటి రెండూ కాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
Samantha: చైతూ ఫోటోలని తొలగించిన సమంత
పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర హీరోయిన్గా పరిచయం అవుతుందా..?
Bail to Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
Samantha: నయన్‌కు బెస్ట్ విషెస్ అందించిన సామ్…ఎందుకో తెలుసా..!
Samantha: నాగచైతన్య కోసం సమంతఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha: సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

