Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్, నటి కంగనా రనౌత్ ముంబైలోని తన పాలిహిల్ బంగ్లాను విక్రయించింది. 2017లో సెప్టెంబర్‌లో ఈ బంగ్లాను కంగనా రూ. 20.7 కోట్లకు కొనుగోలు చేయగా ఏకంగా రూ. 32 కోట్లకు విక్రయించిందని జప్కీ రిపోర్ట్ వెల్లడించింది. కాగా 2022 డిసెంబర్లో ఈ ఆస్తిని తనఖా పెట్టి కంగనా రూ. 27 కోట్లు బ్యాంకు రుణం తీసుకుంది. ఈ ప్రాపర్టీని తన ప్రొడక్షన్ హౌస్ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయంగా మార్చేసింది.
ఈ బంగ్లా 3075 చదరపు అడుగుల విస్తీర్ణం కాగా, 565 ఎస్ఎఫ్టీ పార్కింగ్ స్పేస్‌కు కేటాయించారు. ఇక కంగనా రనౌత్ ఈ ప్రాపర్టీని ఈ ఏడాది సెప్టెంబర్ 5న విక్రయించారని అధికారికంగా అదే రోజు రిజిస్ట్రేషన్ జరిగిందని సమాచారం. తమిళనాడులోని కోయంబత్తూర్ కేంద్రంగా నడిచే కమలిని హోల్డింగ్స్ భాగస్వామి శ్వేత భతిజ ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. కాగా, 2020లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇదే ప్రాపర్టీపై కొరడా ఝళిపించింది.
అక్రమ నిర్మాణం అంటూ కంగనా బాంద్రా కార్యాలయంలో కొన్ని భాగాలను బీఎంసీ తొలగించింది. ఆపై ముంబై హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో కూల్చివేత పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బీఎంసీపై కేసు నమోదు చేసిన కంగనా రూ. 2 కోట్ల పరిహారాన్ని కోరింది. అయితే 2023 మేలో ఆమె తన డిమాండ్లను ఉపసంహరించుకుంది. మరోవైపు కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీ సెన్సార్ చిక్కులతో విడుదలలో జాప్యం నెలకొంది. ఈ సినిమాలో నటిగా, రచయితగా, దర్శకురాలిగా కంగనా బాధ్యతలు తలకెత్తుకోగా అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పడే, వికాస్ నాయర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Read More :
Visual Intelligence: కెమెరా ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు.. ఐఫోన్ 16లో విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్