లాస్ ఏంజిల్స్: యాపిల్ సంస్థ ఐఫోన్ 16 మోడల్‌ను రిలీజ్ చేసింది. అయితే కొత్త కొత్త ఫీచర్లను ఆ ఫోన్లో యాడ్ చేసింది. విజువల్ ఇంటెలిజెన్స్(Visual Intelligence)కు సంబంధించిన ఫీచర్ చాలా ఆసక్తికరంగా ఉన్నది. యాపిల్ ఫోన్లోని కెమెరా ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మనం ఉన్న చోట.. యాపిల్ కెమెరాను ఆన్ చేస్తే, అప్పుడు ఆ కెమెరా పాయింట్ చేస్తున్న ప్రదేశానికి చెందిన సమాచారం మన ఫోటోన్లో అప్డేట్ అవుతుంది. కెమెరా కంట్రోల్ ఫీచర్‌ను.. ఫోన్‌కు సైడ్‌లో ఉన్న బటన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. విజువల్ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఈ ఫీచర్ గురించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్రెయిగ్ ఫెడిరిగి వెల్లడించారు.
విజువల్ ఇంటెలిన్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఒకవేళ కెమెరా కంట్రోల్‌ను క్లిక్ చేసి.. ఆ కెమెరాను రెస్టారెంట్ వైపు చూపిస్తే, అప్పుడు ఆ రెస్టారెంట్‌కు సంబంధించిన వివరాలు అన్నీ మన ఫోటోలో ప్రత్యక్షం అవుతాయి. ఆ హోటల్‌కు ఉన్న రివ్యూలు, మెనూతో పాటు టేబుల్ రిజర్వేషన్‌కు సంబంధించిన సమాచారం వెల్లడిస్తుంది.
ఇంకా శునకాల బ్రీడ్స్ గురించి, ఏదైనా ప్రదేశానికి చెందిన ల్యాండ్‌మార్క్‌ల గురించి విజువల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని ఫెడిరిగి తెలిపారు. మన క్యాలెండర్లో ఏదైనా సమాచారాన్ని యాడ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఛాట్జీపీటీతోనూ యాపిల్ సంస్థకు లింక్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కెమెరా కంట్రోల్ యాక్సిస్ ద్వారా ఛాట్‌జీపీటీని కూడా యాక్సిస్ చేసుకోవచ్చు.