Kangana Ranaut | పరువు నష్టం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటి కంగనా
Kangana Ranaut | బాలీవుడ్ నటి పంజాబ్ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పరువు నష్టం కేసులో భటిండా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఉపశమనం కోసం కోర్టు మెట్లెక్కింది. కంగనా పిటిషన్పై ఈ నెల 11న విచారణ జరుగనున్నది. గతేడాది జనవరిలో భటిండాలో కంగనాపై పరువు నష్టం ఫిర్యాదు అందింది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భటిండాకు చెందిన మొహిందర్ కౌర్ ఫొటోను షేర్ చేస్తూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
రూ.100 కూలీ ఇచ్చి రైతుల ఉద్యమంలోకి తీసుకువచ్చినట్లు ట్వీట్ చేసింది. ఆ తర్వాత కంగనాపై విమర్శలు వెల్లువెత్తగా.. ఆ తర్వాత ట్వీట్ను తొలగించింది. ఆ తర్వాత పంజాబ్కు వెళ్లిన సమయంలో కంగనాను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భటిండా కోర్టులో కంగనాపై మొహింద్ కౌర్ జనవరి 4, 2021న పరువు నష్టం కేసు వేశారు. ఆ తర్వాత విచారణ దాదాపు 13 నెలల పాటు కొనసాగింది. ఈ కేసులో కంగనాకు సమన్లు జారీ చేసిన కోర్టు.. బాలీవుడ్ నటిని కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది.
అయితే, ఆ సమయంలో మొహింద్ కౌర్ తనకు 13 ఎకరాల భూమి ఉందని, ఇప్పటికీ తన కుటుంబంతో కలిసి కష్టపడుతున్నట్లు కంగనాకు బదులిచ్చింది. కంగనాకు కరోనా సమయంలో పనిలేకపోతే తనకు వద్దకు రావొచ్చునంటూ మొహిందర్ కౌంటర్ ఇచ్చింది. పొలంలో పని చేసినందుకు ప్రతిఫలంగా కంగనాకు వేతనం చెల్లిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ చెప్పింది. కంగనా చేసిన ట్వీట్ తనను మానసికంగా ఇబ్బందికి గురి చేసిందని, తన ప్రతిష్ట దెబ్బతిందని పిటిషన్లో మొహిందర్ కౌర్ ఆరోపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

