బాలీవుడ్ నటి కంగనారనౌత్ కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సారి కంగనా బాడీగార్డు కు సంబంధించిన న్యూస్ ఒకటి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కంగనా బాడీడార్డు కుమార్ హెగ్డేపై ఓ చీటింగ్ కేసు నమోదైంది. కుమార్ హెగ్డే పెండ్లి పేరుతో తనతో ఎనిమిదేళ్లు సాన్నిహిత్యంగా ఉండి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ అతడిపై ఫిర్యాదు చేసింది.
బీటౌన్ సమాచారం మేరకు కుమార్ హెగ్డే, సదరు బాధితురాలు ఎనిమిదేళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అయితే దీనిపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Video Player is loading.
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
ఎన్టీఆర్కు ఇష్టమైన నెంబర్ ఏంటో తెలుసా?
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్
Recommended Content by ntnews.com