లక్నో : న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రాబోయే ఐపీఎల్లో కొత్త అవతారం ఎత్తనున్నాడు. సుమారు పదేండ్ల పాటు ఈ లీగ్‌లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించిన కేన్ మామ.. వచ్చే సీజన్లో బ్యాటర్‌గా కాక డ్రెస్సింగ్ రూమ్ నుంచి సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) అతడిని ఐపీఎల్ 2026కు గాను స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించింది.
కార్ల్ డేనియల్ క్రొ (ఇంగ్లండ్)ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తీసుకుంది. ఈ మేరకు లక్నో యజమాని సంజీవ్ గొయెంకా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేశారు. జస్టిన్ లంగర్ హెడ్‌కోచ్‌గా, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కొనసాగనున్నారు.