Kamal Haasan | కన్నడ భాషపై వివాదం.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
Kamal Haasan | తమిళం నుంచి కన్నడ భాష (Kannada language) పుట్టిందంటూ కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయంపై కమల్ హాసన్ తాజాగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించారు.
Kamal Haasan | తమిళం నుంచి కన్నడ భాష (Kannada language) పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయంపై కమల్ హాసన్ తాజాగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించారు.
తన రాబోయే చిత్రం థగ్ లైఫ్‌ను రాష్ట్రంలో విడుదల చేసి ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
‘శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు.
‘థగ్‌లైఫ్’పై కర్ణాటకలో నిషేధం
కర్ణాటక రక్షణ వేదికతో పాటు పలు ప్రజా సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి. ఈ నెల 30లోగా కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే ‘థగ్‌లైఫ్’ను బహిష్కరిస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) అల్టిమేటం జారీచేసింది. అందుకు అనుగుణంగానే మే 30న కేఎఫ్సీసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. తాము విధించిన డెడ్‌లైన్ ముగిసినా కమల్‌హాసన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ‘థగ్‌లైఫ్’ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను.. కమల్ హాసన్
మరోవైపు తాజా వివాదంపై క్షమాపణ చెప్పడానికి కమల్‌హాసన్ నిరాకరించారు. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘గతంలో కూడా నా మీద ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి. తప్పుచేయని పక్షంలో నేను అస్సలు క్షమాపణలు చెప్పను. ఇది నా జీవన విధానం. నేను ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, చట్టాన్ని నమ్ముతాను. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దు’ అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘థగ్‌లైఫ్’ జూన్ 5న విడుదలకానుంది.
Also Read..
Aamir Khan | అనుకోకుండా కలిశాం.. ప్రేమికులమయ్యాం : గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్‌పై ఆమిర్ ఖాన్
Vidya Balan | హీరోయిన్లు అవకాశాలకు తగ్గట్లు మారాలి..! విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Chiranjeevi | ఆలీకి మామిడిపండ్లతో పాటు సురేఖ వంటకాలని పంపిన చిరంజీవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

