Kalyani Priyadarshan | లోక సినిమాతో రూటు మార్చేసింది కళ్యాణి ప్రియదర్శన్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలువడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అత్యధిక గ్రాస్ సాధించిన సౌతిండియన్ ఫీ మేల్ సెంట్రిక్ మూవీగా నిలిచింది. మాలీవుడ్ లో గత రికార్డులు బీట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్ మళ్లీ గ్లామరస్ అవతార్‌లోకి మారిపోయింది.
కోలీవుడ్ నటుడు రవిమోహన్ నటిస్తున్న ఫాంటసీ ఫిల్మ్ Genie. మేకర్స్ ఈ మూవీ నుంచి Abdi Abdi అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కలర్ఫుల్గా సాగుతున్న ఈ పాటను చూసి స్టన్ అవుతున్నారు నెటిజన్లు. దీనిక్కారణం ఏంటనుకుంటున్నారా..? ఎవరూ ఊహించని విధంగా సూపర్ గ్లామర్ రోల్లో దర్శనిమిచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. ఈ భామ కమర్షియల్ సినిమా హీరోయిన్గా ట్రాన్స్ఫార్మేషన్ అయిన తీరుకు షాక్ అవుతున్న ఫాలోవర్లు, నెటిజన్లు.. ఈ సాంగ్‌లో వేసిన స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.
గ్లామరస్ పాత్ర గురించి కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. ఓ యాక్టర్‌గా నేను ఇదివరకెన్నడూ చేయని పాత్రలను చేయాలని నాకు నేను చాలెంజింగ్‌గా తీసుకుంటా. ఈ పాటలో అలాంటి కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. నా డైరెక్టర్ భువనేశ్ ఈ విషయం గురించి నాకు చెప్పినప్పుడు.. అతడు Genie కథకు చాలా ముఖ్యమైన అందమైన కమర్షియల్ మ్యూజికల్ పీస్‌ను అద్భుతంగా ఎలా తీశాడోనని అనిపించింది. దీనివెనుకున్న కారణాలు చాలా శక్తివంతమైనవి. ఏదైనా కొత్తగా చేయాలని.. చాలా బాగా కష్టపడటం జరిగింది. మీరంతా ఈ పాటను ఇష్టపడతారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్