Kalki 2898 AD OTT | ప్రభాస్ (prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్`కల్కి 2898 ఏడీ’. ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపిక పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్ నటించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 39 సంవత్సరాల తరువాత ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కలిసి నటించడంతో ఈ చిత్రం విలువ ఇంకా పెరిగింది. సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎప్పుడొస్తుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రియుల్లో జోష్ నింపే వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది. కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకున్నట్లు టాక్. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈనెల 23 (ఆగస్టు) నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు మూవీ వర్గా్ల్లో చర్చ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది.
Also Read..
Rashmika Mandanna | ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నా.. అవకాశాలు అంత సులువుగా రాలే: రష్మిక
Vikram | థ్రిల్లింగ్ అడ్వెంచర్ తంగలాన్.. కొత్త ప్రపంచాన్ని చూస్తారు: విక్రమ్
The Lion King | లయన్‌కింగ్‌కు షారుఖ్ డబ్బింగ్