Vikram | థ్రిల్లింగ్ అడ్వెంచర్ తంగలాన్.. కొత్త ప్రపంచాన్ని చూస్తారు: విక్రమ్
“తంగలాన్' థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ. కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ నేపథ్యంలో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా థియేటర్స్‌లో చూసి ఈ అడ్వెంచరస్ జర్నీని ఆస్వాదించండి’ అన్నారు హీరో విక్రమ్.
Vikram | “తంగలాన్’ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ. కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ నేపథ్యంలో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా థియేటర్స్‌లో చూసి ఈ అడ్వెంచరస్ జర్నీని ఆస్వాదించండి’ అన్నారు హీరో విక్రమ్. ఆయన తాజా పీరియాడిక్ చిత్రం ‘తంగలాన్’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. పా.రంజిత్ దర్శకుడు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తున్నది.
సోమవారం విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ‘నా ‘అపరిచితుడు’ మూవీ దేశంలోనే అత్యధిక రోజులు విజయవాడలో ఆడింది. తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో అభిమానం కనబరుస్తారు. ‘తంగలాన్’ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది’ అన్నారు.
ఈ సినిమాలో తాను పోషించిన ఆరతి పాత్ర కెరీర్లో బెస్ట్రోల్ అని కథానాయిక మాళవిక మోహనన్ తెలిపింది. సినిమాలో విక్రమ్ మేకోవర్, పాత్ర కోసం ఆయన పడిన కష్టం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుందని నిర్మాత ధనుంజయన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: స్టూడియోగ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, నిర్మాత: కేఈ జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: పా.రంజిత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

