Rashmika Mandanna | ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అగ్ర కథానాయికగా చలామణి అవుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు అంత సులభంగా రాలేదని చెప్పింది రష్మిక.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాటి కష్టాల గురించి చెప్పుకొచ్చిందీ భామ. ఆమె మాట్లాడుతూ ‘ఆడిషన్స్‌కు వెళ్లిన ప్రతీసారి తిరస్కారాలు ఎదురయ్యేవి. కొందరైతే నేను నటిగా సక్సెస్ కావడం చాలా కష్టమని మాట్లాడేవారు. అవకాశాలు రావనే దిగులుతో కన్నీళ్లతో ఇంటికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఓ సినిమా సెలెక్ట్ చేసిన తర్వాత మూడు నెలల పాటు వర్క్‌షాప్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.. ఎప్పుడూ సినీరంగం నుంచి తప్పుకోవాలనుకోలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, నటిగా ప్రతీ సినిమాకు ప్రతిభను మెరుగుపరచుకుంటూ ఈ స్థాయికి వచ్చా’ అని చెప్పింది. ఆమె మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ తో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నది.