The Lion King | లయన్‌కింగ్‌కు షారుఖ్ డబ్బింగ్ వాల్ట్‌డిస్నీ రూపొందించిన ‘ది లయన్ కింగ్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ ఫ్రాంచైజీలో కొత్త సినిమాగా ‘ముఫాసా: ది లయన్‌కింగ్’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. పలు భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ వాయిస్ఓవర్ అందించారు.
సినిమాలోని ప్రధాన పాత్ర ముఫాసాకి షారుఖ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆయన కుమారులు ఆర్యన్, అబ్రమ్లు కూడా ఈ సినిమాలోని సింబా, చిన్ననాటి ముఫాసా పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే విడుదలైన హిందీ ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రానికి బారీజెంకిన్స్ దర్శకత్వం వహించారు.