Kalki 2898 AD | ఉలగనాయగన్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ గాడ్ కింగ్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నటించగా.. ఈ రోల్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది.
తాజాగా సుప్రీమ్ యాస్కిన్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాత్రలోకి ట్రాన్స్ఫార్మేషన్ అయ్యేందుకు కమల్ హాసన్ ఎలా కష్టపడ్డాడో వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కమల్ హాసన్.. ప్రస్తుతం థగ్ లైఫ్, ఇండియన్ 3 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన థగ్ లైఫ్ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
సుప్రీమ్ యాస్కిన్ మేకింగ్ వీడియో..
Birthday wishes to our SUPREME, the one and only Ulaganayagan @ikamalhaasan sir.
A universal phenomenon who breathes cinema.#Kalki2898AD pic.twitter.com/zCu3lxFD79— Vyjayanthi Movies (@VyjayanthiFilms) November 7, 2024
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్