Kalki 2898 AD | బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ జైత్రయాత్ర ఇంకా కొనసాగుతున్నది. పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ రీసెంట్గా రూ.800 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రూ.900 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు కొత్త అనుభూతిని పంచుతుంది. చాలా కాలం తరువాత థియేటర్లు ప్రేక్షకులతో కళ కళలాడుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలు లేక, సరైన కంటెంట్‌తో సినిమాలు రాక విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతితో పాటు మంచి సినిమా చూశామన్న ఆనందాన్ని ఇచ్చింది. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రానికి అత్యంత భారీ విజయాన్ని అందించారు. ముఖ్యంగా చిత్రంలో వున్న హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, విజువల్స్ చూసి, తెలుగు సినిమా స్థాయిని ప్రశంసిస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్రానికి సమయం కూడా కలిసొచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంతటి భారీ స్థాయి సినిమా రాకపోవడంతో పాటు సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీగా మారింది. సినిమాలో కీలకంగా వున్న బుజ్జి కారు, ఇలా సినిమాలో పాటు చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు అలరించే అంశాలు ఈ చిత్రంలో వుండటం కూడా మరో కారణం.
Raging towards the magical milestone…❤️🔥#EpicBlockbusterKalki in cinemas – https://t.co/z9EmiReie8#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/Jyf1bAamUu
— Kalki 2898 AD (@Kalki2898AD) July 8, 2024
ఇవి కూడా చదవండి..