Virupaksha | టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తోన్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి విరూపాక్ష (Virupaksha). మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో SDT15గా వస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి కలల్లో (Kalallo Lyrical Video Song) మెలోడి లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. సెలయేటి సవ్వళ్లలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ మధ్య సాగుతున్న మెలోడీ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ మిస్టరీ ఎలిమెంట్స్ తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విరూపాక్షలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ కీలక పాత్రలు నటిస్తున్నారు. విరూపాక్ష ఏప్రిల్ 21న విరూపాక్ష ప్రేక్షకుల ముందుకు రానుంది.
కలల్లో లిరికల్ వీడియో సాంగ్..
The Magical Melody #Kalallo from #Virupaksha is here 😍
Enjoy now 👇
▶️ https://t.co/zlJYXT5yeN#VirupakshaOnApril21 ✅@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli @SVCCofficial pic.twitter.com/DirkZTINie— Sukumar Writings (@SukumarWritings) April 17, 2023
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..
Mark Antony | మార్క్ ఆంటోనీ సెట్స్‌లో ఎస్జే సూర్య, విశాల్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Agent | యాక్షన్ అవతార్‌లో మమ్ముట్టి.. ఏజెంట్ స్టన్నింగ్ లుక్
Dhruva Natchathiram | విక్రమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ధ్రువ నక్షత్రం ఫస్ట్ లుక్