Mark Antony | తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన విశాల్ (Vishal) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah), సెల్వ రాఘవన్, సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన అదిరిపోయే మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా కొత్త అప్డేట్ అందించింది విశాల్ టీం. మార్క్ ఆంటోనీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా లొకేషన్లో విశాల్ గన్ పేల్చగా.. ఎస్జే సూర్య కేక్ కట్ చేసి.. యూనిట్ సభ్యులందరికీ తినిపించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలువబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. మోషన్ పోస్టర్ ద్వారా సునీల్, ఎజేసూర్య, సెల్వ రాఘవన్ పాత్రలను పరిచయం చేసి.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అధిక్ రవిచంద్రన్.
మార్క్ ఆంటోనీలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు విశాల్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
మార్క్ ఆంటోనీ లొకేషన్లో సెలబ్రేషన్స్ ..
& that’s a wrap with @iam_SJSuryah for #MarkAntony #MarkAntonyComingSoon@VishalKOfficial @selvaraghavan @Adhikravi @ministudiosllphttps://t.co/wFdFEkGTGo pic.twitter.com/tYojaC9xgb
— BA Raju’s Team (@baraju_SuperHit) April 17, 2023
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..