Kajol | అలనాటి అందాల ముద్దుగుమ్మ కాజోల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో, కమర్షియల్ యాడ్స్ లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య కాజోల్ ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం కలిగిన ఫిల్మ్ స్టూడియోగా గిన్నిస్ బుక్ అవార్డును అందుకున్న రామోజీ ఫిల్మ్ స్టూడియో లో తనకు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని, అక్కడ దెయ్యాలు ఉన్నాయన్నట్లు రీసెంట్ గా చెప్పుకొచ్చింది.
కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి, వెంటనే ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి ఆ తరువాత ఎప్పుడు అక్కడకు వెళ్లాలనిపించదు. అందులో ఒకటి హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ స్టూడియో అని కాజోల్ కామెంట్ చేసింది. దీనిపై నెట్టింట పలు రకాల కామెంట్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే తన కూతురిని ట్రోల్స్ చేసే వారికి తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కాజోల్. నా కూతుర్ని విమర్శించే వాళ్ళు ఎవరూ కూడా నా కారు ముందుకు రావద్దు. ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరంపై నుండి నా కారుని పోనిస్తాను.
సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్‌లు వస్తే అందులో 999 కామెంట్స్ తను అందంగా ఉంది, అమేజింగ్, ఇలాంటి కామెంట్స్ ఉంటాయి. కాని ఏదో ఒక్క కామెంట్ మాత్రం బ్యాడ్‌గా ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను.చెడుని లెక్క చేయను అని ఘాటు కామెంట్స్ చేసింది. కాగా, కాజోల్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ని 1999 లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూనే అడపాదడపా సినిమాలలో నటిస్తూ అలరిస్తుంది.