Kajol | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది బాలీవుడ్ భామ కాజోల్ (Kajol). ఈ ఏడాది జూన్‌లో మైథలాజికల్ హార్రర్ థ్రిల్లర్ మా (Maa) సినిమాతో థియేటర్లలోకి వచ్చింది కాజోల్. అజయ్ దేవ్గన్ నిర్మించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. విశాల్ ఫురియా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైతాన్ యూనివర్స్‌లో వచ్చిన మా ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద రూ.51.64 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
థ్రియాట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు ఆగస్టు 22న (నేడు) డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ఓటీటీ ప్లాట్‌ఫాం అధికారికంగా ప్రకటించింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో మా డబ్బింగ్ వెర్షన్లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది.
మరి నెట్‌ఫ్లిక్స్‌లో హార్రర్ థ్రిల్లర్‌కు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఖెరిన్ శర్మ, జితన్ గులాటి, జితేంద్ర కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దేవ్గన్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్, పనోరమ స్టూడియోస్ బ్యానర్లపై అజయ్ దేవ్గన్, జ్యోతి దేశ్ పాండే, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా తెరకెక్కించారు.
#MAA (Hindi) streaming from Tonight on Netflix 🍿!!#OTT_Trackers https://t.co/5ZkW0GumXy pic.twitter.com/f6p3wwjQ9C
— OTT Trackers (@OTT_Trackers) August 21, 2025
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Naga Chaitanya-Sobitha | తిరుమలలో శోభిత చేయి విడవని నాగ చైతన్య.. ఫొటోల కోసం ఎగబడ్డ భక్తులు
Dragon | తారక్ డ్రాగన్ కోసం స్పెషల్ హౌస్ సెట్.. ప్రశాంత్ నీల్ అదిరిపోయే ప్లాన్..!
SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రయోగం.. జంగిల్ సఫారీ రైడ్ అందుకేనా..?