sirivennela | శోకసంద్రంలో కె.విశ్వనాథ్.. ఏం మాట్లాడాలో.. ఏం చేయాలో తెలియట్లేదంటూ ఉద్వేగం

k viswanath and sirivennela | కళాతపస్వి కె.విశ్వనాథ్, సినీ గేయ రచయిత సిరివెన్నెలది గురుశిష్యుల బంధం. అంతకంటే మించి తండ్రీకొడుకుల్లాంటి అనుబంధం. ఒక సాధారణ చెంబోలు సీతారామశాస్త్రిని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మార్చింది కె.విశ్వనాథ్. అనామకుడిగా ఉన్న ఆయనలోని ప్రతిభను గుర్తించి.. ప్రోత్సహించిందీ.. దానికి తగ్గ అవకాశాల్ని కల్పించింది కళాతపస్వి. అందుకే కె.విశ్వనాథ్‌ను సిరివెన్నెల తండ్రిలా చూస్తారు. మా నాన్నగారు నాకు జన్మనిస్తే.. నాకు సినీ నామకరణం చేసి.. కవిగా జన్మనిచ్చిన తండ్రి కె.విశ్వనాథ్ అని ఒక సందర్భంగా సిరివెన్నెల చెప్పుకొచ్చారు. ఆ గౌరవంతోనే కె.విశ్వనాథ్‌ను ఆయన ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేవారు కాదు.. కొన్నిసార్లు ప్రేమతో నాన్నగారు అని కూడా సంబోధించేవారు. కె.విశ్వనాథ్ కూడా సిరివెన్నెలను అంతే ప్రేమగా చూసుకునేవారు. అలా ఎన్నో ఏండ్లుగా వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకునిపోయింది. అలాంటి ఆప్తమిత్రుడు దూరం కావడంతో కె.విశ్వనాథ్ ఎంతగానో తల్లడిల్లిపోయారు. తన ఆవేదనను ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసి ఉద్వేగానికి లోనయ్యారు.
శోకసంద్రంలో కె.విశ్వనాథ్.. ఏం మాట్లాడాలో.. ఏం చేయాలో తెలియట్లేదంటూ ఉద్వేగం pic.twitter.com/KOyFtv0GcE
— Namasthe Telangana (@ntdailyonline) November 30, 2021
‘ఇది నమ్మలేని నిజం. నాకు ఇది చాలా పెద్ద లాస్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోయినప్పుడు కుడి భుజం రాలిపోయిందనుకున్నాను. ఇప్పుడు సిరివెన్నెల మరణంతో నా ఎడమ భుజం కూడా పోయింది. ఏమిటో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అంత సన్నిహితంగా ఉండి.. అంత చక్కగా మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా అంతర్థానమైపోయాడంటే నమ్మశక్యం కావట్లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వాళ్ల కుటుంబసభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నా. నేను ఇంతకన్నా ఏం మాట్లాడలేకపోతున్నా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు కళాతపస్వి కె.విశ్వనాథ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవితంలో కీలకమైన ఘట్టాలు ఇవే..
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..
‘సిరివెన్నెల దురదృష్టం..తెలుగు వారి అదృష్టం..’ త్రివిక్రమ్ స్పీచ్ వీడియో ట్రెండింగ్
సిరివెన్నెల, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?
sirivennela songs | అలాంటి పాటలను రాయలేను : సిరివెన్నెల
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
sirivennela | సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..
అష్టైశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను: సిరివెన్నెల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

