Junior | గాలి జనార్ధన్ రెడ్డి పేరు చాలా మంది వినే ఉంటారు. . కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు కాగా,ఆయన ఆయన కూతురు పెళ్లితో దేశమంతా మాట్లాడుకునేలా చేశారు. వందల కోట్లు పెళ్లి కోసం ఖర్చుపెట్టి హాట్ టాపిక్ అయ్యారు. ఇక కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించి 2022లో ‘జూనియర్ అనే సినిమా మొదలు పెట్టారు. కిరిటీ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను సాయి కొర్రపాటి ప్రొడక్షన్ హౌస్ లో రజని నిర్మిస్తున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జెనీలియా , రవిచంద్ర కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.
ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ తో పాటు ప్రముఖ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఎప్పుడో మొదలైన జూనియర్ అనే చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో జూలై 18న విడుదల చేయబోతున్నట్టు గురువారం మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కె. కె. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ కాగా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తండ్రి జనార్దన్ రెడ్డి ఓ పక్క జైలు జీవితాన్ని గడుపుతుంటే… కొడుకు కిరీటి సినిమా జాతీయ స్థాయిలో విడుదల అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. భారీ బడ్జెటతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుండగా, కిరీటీ తొలి సినిమాతో మంచి హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
ఇక గాలి జనార్ధన్ రెడ్డి విషయానికి వస్తే ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. ఆయన కేవలం ఓ ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. ఆయన తండ్రి చిత్తూరు జిల్లా నుంచి బళ్లారికి వలస వెళ్లారు. బుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో మైనింగ్ వ్యాపారం ప్రారంభించకముందు, కోల్కతాలోని ఓ కంపెనీ కోసం గాలి జనార్ధన్ రెడ్డి ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించే వారు. ఆ తర్వాత చిట్ఫండ్ సంస్థను ప్రారంభించారు. అందులో ఆయన అక్రమాలకు పాల్పడటంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చర్యలతో దీన్ని మూసేశారు. అయితే అక్కడే ఆయనకు చాలా కిటుకులు తెలుసకొని వ్యాపారాల్లో, రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి సరికొత్త మార్గాలను అన్వేషించారు. రాజకీయాలలో కూడా ఆయన తన మార్క్ చూపించారు.