టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. కాగా ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. కాగా బాబీ టీం మాస్ మహారాజా రవితేజ ప్రోమోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రోమోపైనే వర్క్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. త్వరలోనే రవితేజ మాస్ ప్రోమోతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది చిరు అండ్ బాబీ టీం. ప్రస్తుతానికి రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేకున్నా.. ఈ అప్డేట్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. చిరంజీవి మాస్ లుక్‌లో అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడని ఇప్పటివరకు విడుదలైన రషెస్‌తో తెలిసిపోతుంది.
చిరంజీవి మరోవైపు మెహర్‌రమేశ్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా షూటింగ్ దశలో ఉండగా.. కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. భోళా శంకర్‌లో చిరంజీవి సోదరి పాత్రలో నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తిసురేశ్ నటిస్తోంది.
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :Poonam Kaur | అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్..?
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో