టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Siva Koratala) కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు ఎన్టీఆర్ 30 ( NTR 30). కొరటాల ఇప్పటికే మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా..గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. గతేడాది ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్..నెక్ట్స్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చాలా కాలమే బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం ప్రిపరేషన్ ప్లాన్ మొదలుపెట్టినట్టు ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఈ చిత్రం కోసం తారక్ శిక్షణ తీసుకోవడం షురూ చేశాడట. తాజా ప్రాజెక్టులో ఇదివరకెన్నడూ లేని విధంగా స్లిమ్ అండ్ ఫిట్‌గా కనిపించేందుకు తారక్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని టాలీవుడ్ సర్కిల్ టాక్. ఎన్టీఆర్ 30 కోసం జిమ్‌లో చెమటోడుస్తూ..ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్‌పై ఫోకస్ పెట్టినట్టు జోరుగా టాక్ నడుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 2023 సెకండాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. రత్నవేల్ సినిమాటోగ్రాఫర్. తారక్ దీంతోపాటు మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 కూడా చేయబోతున్న విషయం తెలిసిందే.