Jr NTR – Ram Charan | మెగా ప్రిన్సెస్ క్లింకారాకు తారక్ స్పెషల్ గిఫ్ట్..?
Jr NTR - Ram Charan | టాలీవుడ్ స్టార్ నటుల్లో బెస్ట్ ప్రెండ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు రామ్ చరణ్ (Ram Charan) - ఎన్టీఆర్ (Jr NTR). వీరిద్దరి మధ్య మంచి సోదర బంధం ఉంది. ఇదే విషయాన్ని ఇద్దరూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. ఈ క్రమంలో చరణ్-ఉప్సీ దంపతుల గారాల పట్టికి ఎన్టీఆర్ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Jr NTR – Ram Charan | టాలీవుడ్ స్టార్ నటుల్లో బెస్ట్ ప్రెండ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు రామ్ చరణ్ (Ram Charan) – ఎన్టీఆర్ (Jr NTR). వీరిద్దరి మధ్య మంచి సోదర బంధం ఉంది. ఇదే విషయాన్ని ఇద్దరూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. ప్రస్తుతం ఈ ఇద్దరు నటులు గ్లోబల్ లెవల్ లో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. కాగా, రామ్ చరణ్ పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత తండ్రైన విషయం తెలిసిందే. చరణ్ భార్య ఉపాసన (Upasana) గత నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో చరణ్-ఉప్సీ దంపతుల గారాల పట్టికి ఎన్టీఆర్ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకారా (Klin Kaara) కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గోల్డ్ డాలర్స్ ను బహుమతిగా పంపించినట్లు మెగా, నందమూరి కాంపౌండ్ నుంచి టాక్ వినిపిస్తోంది. అది కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్ లు ఎంతో ఇష్టంగా వాటిని అందించినట్లు తెలుస్తోంది. ఆ డాలర్స్ మీద చరణ్, ఉపాసన, క్లింకారాల పేర్లు వచ్చేలా డిజైన్ చేయించినట్లు సమాచారం. ఈ బహుతులు మెగా ఫ్యామిలీకి చాలా బాగా నచ్చినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్-చరణ్ ప్రస్తుతం తమ తదుపరి చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తారక్.. కొరటాల శివతో ‘దేవర’ (Devara) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నారు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read..
Viral News | ఆ గ్రామంలో రోజూ ఒకే టైమ్‌కి పవర్ కట్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Taj Mahal | తాజ్ మహల్ గోడలను తాకిన యమున.. వీడియో
Yamuna River | మళ్లీ డేంజర్ మార్క్ ను దాటిన యమునా నది ప్రవాహం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

