NTR ID Card: ఐడీ కార్డు వేసుకున్న ఎన్టీఆర్, రాజమౌళి..ట్రెండింగ్‌లో స్టిల్స్
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). రాంచరణ్, ఎన్టీఆర్ (NTR) కాంబోలో వస్తున్న ఈ మూవీలోని ఓ పాటను ఉక్రెయిన్ లో షూట్ చేస్తున్నారు. లొకేషన్ లో ఎన్టీఆర్,జక్కన్న ఐడీ కార్డుతో ఉన్న ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). పాన్ ఇండియా కథాంశంతో ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వస్తోన్న ఈ ప్రాజెక్టులో రాంచరణ్, ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాక్ డౌన్ తో అప్ డేట్స్ లేక నిరాశలో ఉన్న అభిమానులు కొన్ని రోజులుగా ఏదో ఒక అప్ డేట్ బయటకు వస్తుండటంతో జోష్ మీదున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన స్టిల్ ఒకటి ఫ్యాన్స్ లో లో మరింత ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ఎన్టీఆర్ మెడలో ఓ ట్యాగ్ పడ్డది. ఆ ట్యాగ్ కు ఉన్న ఐడీ కార్డులో నందమూరి తారకరామారావు అని పేరుండగా..హోదా స్థానంలో యాక్టర్ అని ఉంది.
తారక్ బ్లాక్ టీ షర్ట్, బ్యాగ్ తో స్లైలిష్ గా ట్యాగ్ వేసుకుని నిలబడగా..పక్కనే జక్కన్న కూడా తన మెడలో ఉన్న ట్యాగ్ ను చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్‌లో పాటను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి అండ్ టీం. జక్కన్న, తారక్ ఆర్ఆర్ఆర్ ట్యాగ్ తో షూట్ లొకేషన్ లో దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా..జూనియర్ ఎన్టీఆర్ కొమ్రం భీం గా కనిపించబోతున్నాడు. సీత పాత్రలో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తోంది. అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Meet Cute| జెట్ స్పీడ్‌లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Rajamouli SS
- RRR
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

